AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం, NTR, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఉదయం నుంచి వానలు పడుతున్నాయి. కాగా అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే APSDMA వెల్లడించింది. ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.