ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్ సూచీలు

64చూసినవారు
ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 187.86 పాయింట్లు తగ్గి, 78,520 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 57 పాయింట్లు తగ్గి, 23,762 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, పోర్ట్స్‌, ఎయిర్‌టెల్‌, అపోలో హాస్పిటల్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రెంట్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, టైటాన్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్