AP: జనసేన పార్టీలో చేరికపై మాజీ స్పీకర్ తమ్మినేనీ సీతారాం క్లారిటీ ఇచ్చారు. ‘పీకలేకపోయిన పవన్ పార్టీలో చేరతానా?.. నా కొడుక్కి బాగోలేకపోవడం వల్లే వైసీపీకి దూరంగా ఉన్నా’ అని ఇవాళ తెలిపారు. ఇన్‌ఛార్జి పదవిని కూడా జగన్ పీకేయడంతో సీతారం జనసేనలోకి వెళ్లేందుకు చర్చలు జరిపారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో సీతారాం బొత్స, ఆయన కుమారుడ్ని పరామర్శించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా బొత్స ఆయనను బుజ్జగించినట్లుగా తెలుస్తోంది.