RDT సేవలు స్ఫూర్తిదాయకం: మంత్రి లోకేశ్

70చూసినవారు
RDT సేవలు స్ఫూర్తిదాయకం: మంత్రి లోకేశ్
AP: రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్(RDT) అందిస్తోన్న సేవ‌లు ఎంతో స్ఫూర్తిదాయకమ‌ని మంత్రి నారా లోకేశ్ అన్నారు. RDT ఆధ్వర్యంలో 3 వేల గ్రామాలకు సేవలు అందుతున్నాయని కొనియాడారు. ఇవాళ మంత్రిని RDT వ్య‌వ‌స్థాప‌కుడు విన్సెంట్ ఫెర్రర్ క‌ల‌వ‌గా.. ఆయ‌న్ను మంత్రి స‌త్క‌రించారు. ఉపాధి కల్పన, మహిళా సాధికారత, యువతకు నైపుణ్య శిక్షణ వంటి వాటికి సహకారం అందించాలని లోకేశ్ కోర‌గా.. విన్సెంట్ సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్