ఏపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని మొత్తం 30 జిల్లాలుగా పునర్విభజన చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీని కోసం డ్రాఫ్ట్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అమరావతి కేంద్రంగా అమరరామ అనే పేరుతో జిల్లాగా.. పలాస, నాగవళి, నూజివీడు, తెనాలి, మార్కాపురం, మదనపల్లి, హిందూపురం, ఆదోనిగా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది.