సంక్రాంతి పండుగ వేళ కూటమి నేతల ప్రోత్సాహంతో పలు అసాంఘిక కార్యక్రమాలు జరిగాయని సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఆరోపిస్తోంది. కోనసీమ జిల్లాలో కూటమి నేతల అండతో రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించారని తెలిపింది. రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడి చేశారని పేర్కొంది. దీంతో మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ డ్యాన్స్‌లు జరిగినా పోలీసులు కన్నెత్తి చూడలేదని తెలిపింది.