నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన 'డాకు మహారాజ్' సినిమా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ తో కూడిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి తప్పకుండా చూడాలి అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నాగవంశీ నిర్మించారు. మరి ఈ సినిమా మీరు చూశారా?