మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. కన్న కూతురినే తండ్రి కాల్చి చంపేశాడు. గ్వాలియర్‌లో నివాసముండే మహేష్ గుర్జార్ తన కూతురు తనూ గుర్జార్‌కు పెళ్లి ఫిక్స్ చేశాడు. అయితే కూతురు తండ్రి నిర్ణయించిన పెళ్లిని కాదని వేరే వ్యక్తిని విహాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఆగ్రహించిన తండ్రి పోలీసుల ముందే కూతురును కాల్చి చంపేశాడు.