ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై మరోసారి చర్చ జరుగుతోంది. జగన్‌కు ప్రస్తుతం జెడ్ ప్లస్ భద్రత ఉంది. అయితే ఆయన సెక్యూరిటీ వింగ్‌లో కీలక అధికారిగా డీఎస్పీ ఎస్ మహబూబ్ భాషా ఉండాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. జగన్‌కి ప్రాణహాని ఉన్నందున జెడ్ ప్లస్ భద్రత ఉందని ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.