దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 224.25 పాయింట్ల లాభంతో రూ.76,724.08 వద్ద, నిఫ్టీ 37.15 పాయింట్ల లాభంతో 23,213.20 వద్ద ముగిశాయి. నిఫ్టీలో NTPC, పవర్ గ్రిడ్ కార్ప్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి లాభాల్లోనూ, M&M, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఫిన్‌సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టాల్లో ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.36 వద్ద ముగిసింది.