ప్రముఖ OTT సంస్థ 'ఆహా' మునుపెన్నడూ లేని సరికొత్త కార్యక్రమాలను రూపొందిస్తూ డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిభావంతులైన డ్యాన్సర్ల కోసం గతంలో ఈ సంస్థ.. డ్యాన్స్ ఐకాన్ షోను తీసుకొచ్చింది. మరోసారి ఈ షోతో ముందుకు రాబోతుంది. డ్యాన్స్ ఐకాన్- 2 పేరుతో రానున్న ఈ షోకు హోస్ట్‌గా, నిర్మాతగా యాంకర్ ఓంకార్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు 'ఆహా' సంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది.