ప్రాణాంతక మంకీపాక్స్‌పై కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఆ కేసుల అనుమానితులను గుర్తించి, పరీక్షలు చేయించాలని సూచించింది. అలాగే ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని చెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర నిన్న రాష్ట్రాలు, యూటీలకు లేఖ రాశారు. ’అన్ని రాష్ట్రాలు, యూటీలు ప్రజారోగ్య సంసిద్ధతపై సమీక్షించాలి. ఈ వ్యాధిపై ప్రజల్లోనూ అవగాహన కల్పించాలి’ అని పేర్కొన్నారు.