సూపర్ టైఫూన్ యాగీ వియత్నాంలో భారీ విధ్వంసం సృష్టించింది. తుఫాను కారణంగా ఫు థో ప్రావిన్స్, ఫోంగ్ చౌలో ఎర్ర నదిపై నిర్మించిన ఉక్కు వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 10 కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, ఒక ట్రక్కు నదిలో పడిపోయాయి. ఈ విపత్తు కారణంగా ఇప్పటివరకు 60 మందికి పైగా మరణించారు. 13 మంది తప్పిపోయినట్లు అధికారులు చెప్పారు. వంతెన కూలిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.