‘ఫెంగల్’ తుఫాన్ తీరం దాటి బలహీనపడినప్పటికీ దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
సోమవారం TGలోని ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాలకు HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు APలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, YSR జిల్లాల్లో భారీ, కోస్తా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని APSDMA వెల్లడించింది.