AP: అమరావతి రైతులకు ఇవాళ కూటమి ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వబోతోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు రైతులకు ఈ ప్లాట్లను కేటాయించనున్నారు. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఈ-లాటరీ ద్వారా రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు చేయనున్నారు. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ-లాటరీ నిర్వహణ జరగనుంది.