ఏపీలో రోడ్ టెర్రర్

53చూసినవారు
ఏపీలో రోడ్ టెర్రర్
NTR జిల్లా నందిగామ మండలం ఐతవరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే స్పాటులో మూడు యాక్సిడెంట్లు జరిగాయి. హైవే పక్కన ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ లారీని మరో లారీ ఢీకొట్టింది. ప్రమాదస్థలానికి వెళ్లిన తండ్రీకొడుకులపైకి ఇంకో లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఐతవరం గ్రామానికి చెందిన సంకు మాధవరావు, రామరాజు మరణించారు. మూడు లారీల ప్రమాద స్పాట్‌లో కంటైనర్ డ్రైవర్ కంగారుపడి అతి వేగంగా మలుపుతిప్పడంతో మరో ప్రమాదం జరిగింది. విశాఖ వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. బస్సులో 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్