రాత్రి పడుకున్నాక పీడకలలు రాకుండా ఉండాలంటే పడుకునే ముందు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం వల్ల సుఖవంతమైన నిద్రపట్టే అవకాశం ఉంటుంది. అలాగే, థ్రిల్లర్ మూవీలు, హర్రర్ మూవీలు వంటివి చూడకూడదు. అతిగా ఆలోచించడం, ఒత్తిడికి గురవడం తగ్గించుకోవాలి. వీటి వల్ల పీడకలలు వస్తాయి. పడుకునే గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా సువాసనలు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వీటివల్ల గాఢ నిద్ర పడుతుంది.