ఏపీలో రూ.2 వేల పందెం.. నిండు ప్రాణాన్ని తీసింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. రోశయ్య, గోపిచంద్ అనే యువకులు.. నందిగామ పెద్ద బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకి ఎవరూ ముందు ఒడ్డుకు వస్తే వాళ్లు గెలిచినట్లు అని రూ. 2 వేలకు పందెం కాసారు. ఇద్దరు నీటిలో దూకగా.. రోశయ్య ఒడ్డకు చేరాడు. ఈ ఘటనలో గోపిచంద్ గల్లంతయ్యాడు. పోలీసులు ఎంత గాలించినా ఉపయోగం లేకుండా పోయింది.