వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత సామినేని ఉదయభాను పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను జగన్ పంపినట్లు తెలిపారు. ఇప్పటికే సామినేని పవన్ కళ్యాణ్‌తో సమావేశమై.. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.