గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ రేషనలైజేషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చిన్నపంచాయతీల్లో తక్కువ మంది, పెద్ద పంచాయతీల్లో ఎక్కువ మంది ద్వారా ప్రజలకు సేవలందించేలా ఆలోచనలు చేస్తోంది. 1.61 లక్షల మంది కార్యదర్శులను ప్రభుత్వం వినియోగించుకోనుంది. సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులు, వార్డు సచివాలయాల్లో పరిపాలన, శానిటరీ, విద్య, సంక్షేమ, ఆరోగ్య, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదించనుంది.