నటసింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్-4’ టాక్ షోకు ఎంత ప్రేక్షకాదరణ ఉందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ షో మరింత వినోదాన్ని పంచనుంది. ఈసారి అతిథిగా స్టార్ హీరో వెంకటేశ్ సందడి చేయబోతున్నారు. డిసెంబరు 22న ఇందుకు సంబంధించిన షూటింగ్ జరగనుంది. ఈ మేరకు మేకింగ్ టీమ్ ప్రకటించింది. వెంకీమామ రానుండడంతో మరింత వినోదం అందనుందని ఫ్యాన్స్ ఉర్రూతలూరుతున్నారు.