రాయలసీమలో భద్రత పెంచాలి: కూటమి నేతలు

85చూసినవారు
రాయలసీమలో భద్రత పెంచాలి: కూటమి నేతలు
AP: రాయలసీమ జిల్లాల్లోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో భ‌ద్ర‌తా బలగాలను పెంచాలని కూటమి నేతలు సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనాను కోరారు. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్‌ నియోజకవర్గాలు సమస్యాత్మకంగా ఉన్నాయన్నారు. భద్రత పెంచే విషయమై డీజీపీకి కూడా వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. రాయలసీమలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు దిగుతున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్