ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాపై చలి పంజా విసురుతోంది. రెండు రోజులుగా కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇవాళ జి.మాడుగులలో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లి, డుంబ్రిగూడలో 7, పాడేరులో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10గంటలైనా మంచు కురుస్తూనే ఉంది. దీంతో చలిమంటలతో జనం ఉపశమనం పొందుతున్నారు. మరో 5 రోజుల పాటు తీవ్రమైన చలి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.