భార్య లైంగిక వేధింపులు భరించలేక ఓ భర్త ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఏపీలోని కాకినాడకు చెందిన సూర్యనారాయణపురంలో శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. భార్య వేధింపులు తాళలేక బాధిత వ్యక్తి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాత్రిళ్లు తన భార్య లైంగికంగా చాలా హింసించేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్యే శరణ్యమని బాధిత భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు.