తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. తాంబూలం రూపంలో తీసుకోవడం కంటే.. తమలపాకులను వేసి మరిగించిన నీటిని తాగడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మధుమేహం నియంత్రణలో కూడా తమలపాకు నీరు తోడ్పడుతుంది.