YS జగన్ వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. 'కుటుంబ విషయాలను రోడ్డు మీదుకు తీసుకొచ్చారు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉండటం సహజమే. కానీ ఎవరూ తల్లి, చెల్లిపై కోర్టుల్లో కేసులు వేయరు కదా? చెల్లిపై ప్రేమతో జగన్ షేర్లు బదిలీ చేశారనేది అబద్ధం. ఆస్తులపై ప్రేమతో రక్త సంబంధం, అనుబంధాలు మరిచారు' అని ఆమె అన్నారు.