విజయమ్మను బ్లాక్ మెయిల్ చేస్తున్న షర్మిళ.. వైసీపీ నేత సంచలన ఆరోపణ

60చూసినవారు
విజయమ్మను బ్లాక్ మెయిల్ చేస్తున్న షర్మిళ.. వైసీపీ నేత సంచలన ఆరోపణ
AP: వైఎస్ ఫ్యామిలీ ఆస్తి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆస్తుల విషయంలో వైఎస్ షర్మిళ, విజయమ్మను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ జగన్ కు విజయమ్మ సపోర్ట్ చేస్తే షర్మిళ ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అన్న భయం ఆమెలో ఉందన్నారు. ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నంత వరకు సరస్వతీ భూములను పంచుకోకూడదని జగన్, షర్మిళ మధ్య అగ్రిమెంట్ ఉందన్నారు. సతీష్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

సంబంధిత పోస్ట్