యూపీలోని జౌన్‌పూర్‌లో ఇటీవల దారుణ ఘటన జరిగింది. జేసీ కూడలి దగ్గర సూట్‌కేస్‌లో దొరికిన యువతి మృతదేహం మిస్టరీని పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. విశాల్ సాహ్ని (22) అనే వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమించాడు. వారిద్దరూ ఫిబ్రవరి 28 న కలుసుకున్నారు. అనంతరం వారిద్దరి మధ్య చిన్న వివాదం తలెత్తడంతో ప్రియురాలిని రాడ్డుతో కొట్టి చంపాడు. ఆ తర్వాత ఆమెను సూటుకేసులో కుక్కి చెత్తకుప్పలో పడేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.