అభివృద్ధిని అడ్డుకునే అవివేకిని కాదు: కిషన్‌రెడ్డి

64చూసినవారు
అభివృద్ధిని అడ్డుకునే అవివేకిని కాదు: కిషన్‌రెడ్డి
TG: సీఎం రేవంత్‌ రెడ్డి సహనం, అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రంతో మాట్లాడుతున్నానని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే అవివేకిని కాదని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసినంత మాత్రాన కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత తగ్గదని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్