ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 179 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా 37పరుగులకు మించి చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ముల్డర్, జాన్సన్ చెరో 3 వికెట్లు, మహారాజ్ 2, ఎంగిడి ఒక వికెట్ పడగొట్టారు. తక్కువ స్కోర్‌కే ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడంతో దక్షిణాఫ్రికా సెమీ-ఫైనల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.