AP: కూటమి ప్రభుత్వం ఆక్వా సాగు రైతులకు శుభవార్త చెప్పింది. అమెరికా సుంకాల ప్రభావంతో రొయ్యల ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో రొయ్యల రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సీఎం చంద్రబాబు స్పందించి.. తక్షణం మేతల ధరలు తగ్గించాలని ఆదేశించారు. ఈ క్రమంలో టన్నుకు రూ.4 వేలు తగ్గిస్తున్నట్లు తయారీదారుల సంఘం ప్రకటించింది. ఇది త్వరలోనే అమల్లోకి రానుందని మత్స్యశాఖ ఇన్‌ఛార్జి ఉపసంచాలకుడు ప్రసాద్ తెలిపారు.