రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచులో బెంగళూరు మొదటి వికెట్ కోల్పోయింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఒపెనర్ ఫిల్ సాల్ట్ 65 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. క్రీజులో కోహ్లీ (27* ) పడిక్కల్ (6*) ఉండగా RCB స్కోరు 10 ఓవర్లకు 102/1 గా ఉంది. విజయానికి 60 బంతుల్లో 72 పరుగులు చేయాల్సి ఉంది.