వృద్ధుడిపై ఎస్ఐ దాడి

573చూసినవారు
వృద్ధుడిపై ఎస్ఐ దాడి
బాపట్ల జిల్లా బల్లికురవలో ఓ ఎస్ఐ రెచ్చిపోయాడు. శానంపూడి హనుమంతరావు అనే వృద్ధుడిపై బల్లికురవ ఎస్ఐ శివనాగిరెడ్డి దాడి చేశారు. బడ్డీకొట్టు నడిపై హనుమంతరావును.. మద్యం అమ్ముతున్నాడని ఆరోపిస్తూ ఎస్ఐ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల తనిఖీల్లో మద్యం దొరకలేదని చెబుతున్నారు. హనుమంతరావు టీడీపీ సానుభూతిపరుడనే కారణంతో ఎస్ఐ దాడి చేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్