సాధారణంగా భూ గురుత్వాకర్షణను తప్పించుకోలేక, కొద్దికాలం ప్రదక్షణ చేసే గ్రహ శకలాలను ‘మినీ మూన్స్’ అంటారు. చిన్నగా ఉండటం, అతి వేగంగా కదలటం వల్ల వీటిని చూడటం కష్టం. కొన్నిసార్లు కృత్రిమ వస్తువులూ ఇలా కనిపించిన ఉదంతాలు లేకపోలేదు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన గాయియా వ్యోమనౌకను ఒకసారి గ్రహ శకలమనీ పొరపడ్డారు. రాకెట్ల అవశేషాలూ వీటిని తలపిస్తుంటాయి. కానీ 2024 పీటీ5 మాత్రం అలాంటిది కాదని, ఖగోళ వస్తువు అనటంలో ఎలాంటి సందేహం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.