నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని నాగుల వెల్లటూరు గ్రామపంచాయతీలో ఉన్న ఎస్సీ కాలనీకి గత కొన్ని సంవత్సరాలుగా సిమెంట్ రోడ్డు లేకపోవడంతో టిడిపి నాయకులు వేలూరు కేశవ చౌదరి, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మంజూరు చేయించారు. మంగళవారం సిమెంట్ రోడ్డు పనులు మొదలుపెట్టారు. ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రికి, కేశవ చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.