చిలకలమర్రి జడ్పీ హైస్కూల్ నందు హెచ్ఎం సురేష్ ఆధ్వర్యంలో గురువారం జవహర్ లాల్ నెహ్రు జయంతిని బాలల దినోత్సవంగా నిర్వహించారు. విద్యార్థులు మల్లికార్జున, మనోజ్, మల్లేశ్వర్ నెహ్రు వేషధారణలో పాల్గొన్నారు. విద్యార్థులకు పలు అంశాలలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.