అనంతసాగరం మండల విద్యాశాఖ అధికారి-2 కాటంరెడ్డి ప్రభాకర్ రెడ్డి మండలంలోని శంకర నగరం, లక్కరాజు పల్లి, రేవూరు, కొత్తపల్లి పలు పాఠశాలలను గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులను రిజిస్టర్లను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం వివరాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.