నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి ఆయకట్ట రైతులకు నీరు విడుదల చేయడానికి ఎమ్మెల్యే ఇంటురి నాగేశ్వరరావు మంగళవారం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు వద్దకు వచ్చిన ఆయనకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. జోరు వర్షం పడుతున్నప్పటికీ ఎమ్మెల్యే నీరు విడుదల చేయుటకు శ్రీకారం చుట్టారు.