స్కూల్ వ్యాన్ ఢీకొని మహిళ మృతి

7778చూసినవారు
స్కూల్ వ్యాన్ ఢీకొని మహిళ మృతి
కావలి మండలంలోని ఈదగాలి గ్రామానికి చెందిన వెందోటి సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మమ్మ దంపతులు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం బైక్పై వెళ్తుండగా ఇడిమేపల్లి ప్రాంతంలోని సర్వేపల్లి రైల్వే గేట్ సమీపంలో స్కూల్ వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో వెంకటలక్ష్మమ్మ (30) అక్కడికక్కడే మృతిచెందింది. సుబ్రహ్మణ్యంకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్