దగదర్తి: వైసిపి వీరాభిమాని టిడిపిలో చేరిక

73చూసినవారు
దగదర్తి గ్రామ చింతోపు సెంటర్ వైసీపీ వీరాభిమాని కామినేని లింగయ్య శుక్రవారం రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ పట్ల ఇష్టంతోనే స్వచ్ఛందంగా తాను రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్