నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడింది. ఈ తుఫానుకు ఫెంగల్ గా నామకరణం చేశారు. ఉత్తర వాయువ్య దిశగా ఫెంగల్ తుఫాన్ పయనించనుంది. ప్రస్తుతం పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్నాయి. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆనంద్ తెలిపారు.