కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో కావలి చాలా ప్రశాంతమైన నియోజకవర్గమని కానీ 2019-24 మధ్య కాలంలో విధ్వంసకర నియోజకవర్గంగా మారిందని తెలిపారు. జగనన్న కాలనీలు ఏర్పాటు చేయదలచిన ప్రాంతంలో కావలి మాజీ ఎమ్మెల్యే ముందస్తుగా రైతుల నుండి ఎకరా పొలంను కేవలం రూ. 13 లక్షలకు కొనుగోలు చేసి తన డ్రైవర్లు, ఇంట్లో పని చేస్తున్న వారి పేరు మీద రిజిస్టర్ చేయించడం జరిగిందన్నారు.