కావలి టీచర్స్ కాలనీ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలో నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో హోండా షోరూమ్ వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టింది. గాయపడిన వారిని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.