నెల్లూరు జిల్లాకు భారీ వర్ష సూచికలు ఉండడంతో అధికార యంత్రాంగం, నాయకులు అప్రమత్తమయ్యారు. బుచ్చి మండలం పరిధిలోని మినగల్లు గ్రామంలో పొర్లు కట్ట మరమ్మత్తు పనులను టిడిపి నాయకుడు కోటంరెడ్డి సురేష్ రెడ్డి సోమవారం పర్యవేక్షించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా నేరుగా కాలువలోకి వెళ్లే విధంగా జెసిబి సహాయంతో పూడిక పనులు చేశారు. నియోజకవర్గ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలుసుకుంటున్నారు.