ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకోవాలి
కోవూరు పంచాయతీ పరిధిలోని నందలగుంటలో మాజీ జెడ్పిటిసి, కోవూరు నియోజవర్గం టిడిపి కీలక నేత చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి మంగళవారం పెన్షన్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ. దేశంలో మొట్టమొదట వితంతువులు, వికలాంగులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టిన వ్యక్తి దివంగత ఎన్టీఆర్ అన్నారు. అలాగే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సొంత నిధులతో మహిళల కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసిన టెస్టులను అందరూ ఉపయోగించుకోవాలన్నారు.