బంగ్లా ఆల్‌రౌండర్‌ షకిబ్‌కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ

60చూసినవారు
బంగ్లా ఆల్‌రౌండర్‌ షకిబ్‌కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ
బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్ హసన్‌కు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ బహుమతి అందించాడు. మంగళవారం రెండో టెస్టు ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు మాట్లాడుకుంటున్న సమయంలో షకిబ్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి తన సంతకంతో కూడిన ఓ బ్యాట్‌ను విరాట్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇప్పటికే టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన షకిబ్‌కు భారత్‌‌తో ఇదే చివరి మ్యాచ్‌ కావచ్చని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్