రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలి: కమల్‌హాసన్‌

69చూసినవారు
రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలి: కమల్‌హాసన్‌
'ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా స్నేహితుడు రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను' అని కమల్‌హాసన్‌ సోషల్‌ మీడియా 'ఎక్స్'లో పోస్ట్‌ పెట్టారు. మంగళవారం చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు రజనీకాంత్‌ హృదయ నాళానికి స్టెంట్‌ వేశారు. రజనీకాంత్‌ మరో రెండు రోజుల్లో డిశ్ఛార్జి అవుతారని ఆసుపత్రి వర్గాలు ఇప్పటికే తెలిపాయి. అస్వస్థతతో రజనీకాంత్‌ సోమవారం రాత్రి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్