నెల్లూరు నగరంలో అక్రమంగా గంజాయి సరఫరా అవుతుందని వాటిపై చర్యలు తీసుకోవాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తో బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సిటీ లో స్విగ్గీ ఆర్డర్ల కంటే వేగంగా గంజాయి డెలివరీ అవుతుందని ఆయనకు వివరించారు. పలు సమస్యలను ఎస్పి దృష్టికి తీసుకువెళ్లారు.