తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని తమ తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఓ ప్రేమజంట నెల్లూరు రూరల్ డిఎస్పి శ్రీనివాసరావుకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. నెల్లూరు రూరల్ పెనుబర్తి గ్రామానికి చెందిన షేక్ షాహిదా, తుమ్మతాటి సురేష్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం ఈ పెళ్లిని అంగీకరించకుండా తన భర్త సురేష్ ను చంపుతామని బెదిరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.