అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కోటి రూపాయలు వరద సహాయ నిధులను విడుదల చేసింది. రిలీఫ్ క్యాంపులు, రక్షిత తాగునీరు, ఆహారం, హెల్త్ క్యాంపులు, పారిశుద్ధ్యం కోసం అత్యవసర నిధులను కేటాయించింది. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి సూచించింది.